రంజీ ట్రోఫీ విజతగా విదర్భ జట్టు
Sakshi Education
2018-19 సీజన్ రంజీ ట్రోఫీ విజేతగా విదర్భ జట్టు నిలిచింది.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఫిబ్రవరి 7న జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ విదర్భ 78 పరుగుల తేడాతో సౌరాష్ట్ర జట్టుపై విజయం సాధించింది. దీంతో రంజీ ట్రోఫీని వరుసగా రెండో ఏడాది గెలుచుకున్న ఆరో జట్టుగా విదర్భ గుర్తింపు పొందింది. గతంలో ముంబై, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, రాజస్థాన్ ఈ ఘనత సాధించాయి. రంజీ చాంపియన్‌గా నిలిచిన విదర్భ జట్టుకు ప్రైజ్‌మనీగా బీసీసీఐ రూ.2 కోట్లు ఇవ్వనుంది. అలాగే విదర్భ క్రికెట్ సంఘం (వీసీఏ) రూ.3 కోట్ల ప్రోత్సాహక నగదు బహుమతిని ప్రకటించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2018-19 సీజన్ రంజీ ట్రోఫీ విజేత
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : విదర్భ జట్టు
ఎక్కడ : నాగ్‌పూర్, మహారాష్ట్ర
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2018-19 సీజన్ రంజీ ట్రోఫీ విజేత
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : విదర్భ జట్టు
ఎక్కడ : నాగ్‌పూర్, మహారాష్ట్ర
Published date : 08 Feb 2019 06:01PM