Skip to main content

రక్షణ రంగంలో ఎంత శాతం వరకు ఎఫ్‌డీఐలను కేంద్రం అనుమతించింది?

రక్షణ రంగ అవసరాలను స్థానికంగానే తీర్చుకునే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం... ఈ రంగంలోకి 74 శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆటోమేటిక్ మార్గంలో (అనుమతి అవసరం లేని) వచ్చేందుకు అనుమతించింది.
Current Affairs
అయితే, జాతీయ భద్రత దృష్ట్యా రక్షణ రంగంలోకి వచ్చే ఏ విదేశీ పెట్టుబడిని అయినా సమీక్షించే విసృ్తత అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని పెట్టబడుల ఉపసంహరణ, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) తెలిపింది.

నూరు శాతం అనుమతి ఉంది.. కానీ..
ప్రస్తుతానికి రక్షణ రంగ కంపెనీలు, ప్రాజెక్టుల్లో నూరు శాతం ఎఫ్‌డీఐకి అనుమతి ఉంది. అయితే ఆటోమేటిక్ మార్గంలో ఈ పరిమితి 49 శాతంగానే ఉంది. ఇంతకుమించితే ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. తాజా మార్పుతో ఇకపై 74 శాతం వరకు పెట్టుబడులను ప్రభుత్వ అనుమతి లేకుండానే చేసుకోవచ్చు. అయితే ఇలా చేసే పెట్టుబడితో కంపెనీ ప్రమోటర్‌లో మార్పులు చోటుచేసుకుంటుంటే అందుకు కేంద్రం అనుమతి కోరాల్సి ఉంటుంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : రక్షణ రంగంలోకి 74 శాతం వరకు ఎఫ్‌డీఐలను ఆటోమేటిక్ మార్గంలో (అనుమతి అవసరం లేని) వచ్చేందుకు అనుమతి
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : రక్షణ రంగ అవసరాలను స్థానికంగానే తీర్చుకునే లక్ష్యంతో...
Published date : 18 Sep 2020 05:27PM

Photo Stories