రిలయన్స్ రిటైల్ చేతికి ఫ్యూచర్ రిటైల్
Sakshi Education
రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ అయిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్‌ఆర్‌వీఎల్).... కిషోర్ బియానీ ప్రమోట్ చేస్తున్న ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్ వ్యాపారాలతోపాటు, లాజిస్టిక్స్, వేర్‌హౌజింగ్ విభాగాలను కొనుగోలు చేయనుంది.
ఈ విషయాన్ని ఆర్‌ఆర్‌వీఎల్ ఆగస్టు 29న వెల్లడించింది. ఈ డీల్ విలువ రూ.24,713 కోట్లు అని పేర్కొంది. ఫ్యూచర్ గ్రూప్‌లో భాగమైన 1,800లకుపైగా బిగ్‌బజార్, ఎఫ్‌బీబీ, ఈజీడే, సెంట్రల్, ఫుడ్‌హాల్ స్టోర్లు దేశవ్యాప్తంగా 420లకు పైచిలుకు నగరాల్లో విస్తరించాయి.
డీల్‌లో భాగంగా ఫ్యూచర్ గ్రూప్ రిటైల్, హోల్‌సేల్ వ్యాపారాలు ఆర్‌ఆర్‌వీఎల్‌కు చెందిన రిలయన్స్ రిటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్‌స్టైల్ లిమిటెడ్‌కు బదిలీ అవుతాయి. అలాగే లాజిస్టిక్స్, వేర్‌హౌజింగ్ విభాగాలు ఆర్‌ఆర్‌వీఎల్‌కు బదిలీ చేస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్ వ్యాపారాలతోపాటు, లాజిస్టిక్స్, వేర్‌హౌజింగ్ విభాగాల కొనుగోలు
ఎప్పుడు : ఆగస్టు 29
ఎవరు : రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్‌ఆర్‌వీఎల్)

Published date : 31 Aug 2020 05:38PM