Skip to main content

రెండు కేంద్ర పాలిత ప్రాంతాల విలీనానికి ఆమోదం

కేంద్ర పాలిత ప్రాంతాలైన డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీలను విలీనం చేసేందుకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ నవంబర్ 27న ఆమోదించింది.
Current Affairsఈ బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... మెరుగైన సేవలు అందించడమే విలీనం ఉద్దేశమని చెప్పారు. ఈ విలీనం ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చేదీ ఇంకా ప్రకటించలేదు.

కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీలకు వేర్వేరు సచివాలయాలు, బడ్జెట్ ఉన్నాయి. రెండు ప్రాంతాలను ఏకం చేసిన తర్వాత ఏర్పడే కేంద్రపాలిత ప్రాంతాన్ని ‘దాద్రా, నాగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ’ అని వ్యవహరిస్తారు. దీంతో కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 8కి తగ్గనుంది.
 
డామన్ డయ్యూ
అవతరణ: మే 30, 1987.
విస్తీర్ణం: 112 చ.కి.మీ.
రాజధాని: డామన్
సరిహద్దు రాష్ట్రాలు: గుజరాత్
జనాభా: 2,42,911
స్త్రీలు: 92,811
పురుషులు: 1,50,100
జనసాంద్రత: 2,169
లింగనిష్పత్తి: 618
అక్షరాస్యత: 87.07
స్త్రీలు: 79.59
పురుషులు: 91.48
మొత్తం జిల్లాలు: 2 (డామన్, డయ్యు)
గ్రామాలు: 23
పట్టణాలు: 2
శాసన సభ: లేదు
పార్లమెంటు: లోక్‌సభ సభ్యులు - 1, రాజ్యసభ సభ్యులు - లేరు.
హైకోర్టు: ముంబై
ముఖ్యభాష: గుజరాతీ, హిందీ.
ప్రధాన మతం: హిందూ, క్రిస్టియన్
ప్రధాన పట్టణాలు: డామన్, డయ్యు.
నదులు: కలిమ్, భగవాన్ (డామన్) 
ఖనిజాలు: ఉప్పు.
పరిశ్రమలు: చేపలు, పర్యాటకం,
రోడ్ల పొడవు: డయ్యు - 78 కి.మీ, డామన్-191 కి.మీ.
దగ్గర రైల్వేస్టేషన్లు: వాపి డామన్‌కు, దిల్‌వాడా డయ్యుకు దగ్గరగా ఉండే రైల్వేస్టేషన్లు
విమానాశ్రయం: డాయన్-డయ్యు
 
 
దాద్రానగర్ హవేలీ
అవతరణ: ఆగస్టు 11, 1961
విస్తీర్ణం: 491 చ.కి.మీ.
రాజధాని: సిల్‌వస్సా
సరిహద్దు రాష్ట్రాలు: గుజరాత్, మహారాష్ట్ర
జనాభా: 3,42,853
స్త్రీలు:1,49,675
పురుషులు:1,93,178
జనసాంద్రత: 698
లింగనిష్పత్తి: 775
అక్షరాస్యత: 77.65
స్త్రీలు: 77.65
పురుషులు:86.46
మొత్తం జిల్లాలు: 1
గ్రామాలు: 7
పట్టణాలు: 2
శాసనసభ: లేదు
పార్లమెంట్: లోక్‌సభ-1, రాజ్యసభ- లేదు.
హైకోర్టు: ముంబై
ముఖ్యభాష: భిలీ, గుజరాతీ, మరాఠి, భిలోడి, హిందీ.
ప్రధాన పట్టణం: సిల్‌వెస్సా.
నదులు: సిల్‌వెస్సా, కాన్వెల్
పరిశ్రమలు: వస్త్రాలు, ఇంజనీరింగ్, రసాయనాలు, ఎలక్ట్రానిక్స్, కుటీర పరిశ్రమలు.
వ్యవసాయోత్పత్తులు: రాగి, గోధుమ, చెరకు, వరి, పప్పుదినుసులు, మామిడి, చీకు, లిఛి.
రోడ్డు పొడవు: 635 కి.మీ.
ప్రధాన రైల్వే స్టేషన్లు: వాపి. సిల్‌వస్సాకు 15 కి.మీ. దూరంలో ఉంటుంది.
విమానాశ్రయం: ముంబై విమానాశ్రయం దగ్గరగా ఉంటుంది.
పర్యాటక ప్రదేశాలు: బిన్‌డ్రాబిన్, డీర్ పార్క్, కాన్వెల్, వెన్‌గంగా సరసు, ఐలాండ్ గార్డెన్, దాద్రా, వనవిహార ఉద్యానవనం, గిరిజన సంస్కతికి సంబంధించిన మ్యూజియం
పండుగలు: దివాసో, భవాడ, కాళి పూజ.
 
క్విక్ రివ్యూ :
ఏమిటి :
డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీల విలీనానికి ఆమోదం
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : లోక్‌సభ
Published date : 29 Nov 2019 05:49PM

Photo Stories