Skip to main content

రెజ్లర్ ఆఫ్ ద ఇయర్‌గా దీపక్ పూనియా

భారత యువ రెజ్లర్ దీపక్ పునియా ‘జూనియర్ ఫ్రీస్టైల్ రెజ్లర్ ఆఫ్ ది ఇయర్-2019’ అవార్డుకు ఎంపికయ్యాడు.
Current Affairsఈ విషయాన్ని యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) డిసెంబర్ 17న వెల్లడించింది. 18 ఏళ్ల దీపక్ 2019 ఏడాది అద్భుత ప్రదర్శనతో అంతర్జాతీయ స్థాయిలో మెరిశాడు. ఆగస్టులో ఎస్తోనియాలో జరిగిన ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో 86 కేజీల విభాగంలో దీపక్ విజేతగా నిలిచి స్వర్ణం సాధించాడు. ఈ క్రమంలో 18 ఏళ్ల తర్వాత జూనియర్ ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తొలి భారత రెజ్లర్‌గా అతను ఘనత సాధించాడు. అనంతరం సెప్టెంబరులో కజకిస్తాన్ రాజధాని నూర్ సుల్తాన్‌లో జరిగిన ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో 86 కేజీల విభాగంలో రెండో స్థానంలో నిలిచి రజతం గెలిచాడు. దాంతోపాటు వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
జూనియర్ ఫ్రీస్టైల్ రెజ్లర్ ఆఫ్ ది ఇయర్-2019 అవార్డుకు ఎంపిక
ఎప్పుడు : డిసెంబర్ 17
ఎవరు : దీపక్ పునియా
ఎందుకు : 2019 ఏడాదిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచినందుకు
Published date : 18 Dec 2019 05:47PM

Photo Stories