Skip to main content

రేసింగ్‌ జట్టుపై 4 లక్షల యూరోల జరిమానా

నిబంధనలకు విరుద్ధంగా... ప్రత్యర్థి కారుతో పోలి ఉన్న పరికరాలను వాడుతూ ఫార్ములావన్‌ (ఎఫ్‌1) సీజన్‌లో పోటీపడుతున్న రేసింగ్‌ పాయింట్‌ జట్టుపై అంతర్జాతీయ ఆటోమొబైల్‌ సమాఖ్య (ఎఫ్‌ఐఏ) 4 లక్షల యూరోలు (రూ. 3 కోట్ల 54 లక్షలు) జరిమానా విధించింది. దాంతోపాటుకన్‌స్ట్రకర్స్‌ చాంపియన్‌షిప్‌లో ఆ జట్టు ఖాతాలో నుంచి 15 పాయింట్లు తొలగించింది.
Edu news


ప్రపంచ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్, అతని సహచరుడు వాల్తెరిబొటాస్‌ సభ్యులుగా ఉన్నమెర్సిడెస్‌ జట్టు వాడుతున్న బ్రేక్‌ డక్ట్‌లను రేసింగ్‌ పాయింట్‌ జట్టు గత మూడు రేసుల్లో వాడిందని రెనౌ జట్టు స్టీవార్డ్స్‌కు ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై విచారించిన స్టీవార్డ్స్‌ రెనౌ ఫిర్యాదులో నిజం ఉందని తేలుస్తూ రేసింగ్‌ పాయింట్‌ జట్టును హెచ్చరించి జరిమానా విధించడంతోపాటు పాయింట్లను తీసివేసింది. ప్రస్తుత ఫార్ములావన్‌ సీజన్‌లో నాలుగు రేసులు ముగిశాకకన్‌స్ట్రక్టర్స్‌ చాంపియన్‌షిప్‌ విభాగంలో రేసింగ్‌ పాయింట్‌ జట్టు 42 పాయింట్లతో ఐదో స్థానంలో ఉండగా... 10 పాయింట్లతో రెనౌ జట్టు ఆరో స్థానంలో ఉంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎఫ్‌1 సీజన్‌లో పోటీపడుతున్న రేసింగ్‌ పాయింట్‌ జట్టుపైరూ. 3 కోట్ల 54 లక్షలజరిమానా
ఎప్పుడు : ఆగస్టు 7
ఎవరు :అంతర్జాతీయ ఆటోమొబైల్‌ సమాఖ్య (ఎఫ్‌ఐఏ)
ఎందుకు :నిబంధనలకు విరుద్ధంగా... ప్రత్యర్థి కారుతో పోలి ఉన్న పరికరాలను వాడుతున్నందున

Published date : 08 Aug 2020 08:15PM

Photo Stories