రైతుల ఖాతాల్లోకి వైఎస్సార్ సున్నా వడ్డీ సొమ్ము
Sakshi Education
2019 ఖరీఫ్ పంట కాలానికి సంబంధించి 14.58 లక్షల మంది రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.510.32 కోట్లను నవంబర్ 17న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి చెల్లించారు.
అలాగే 2020, అక్టోబర్‌లో వరదల కారణంగా పంటలు నష్టపోయిన 1.97 లక్షల మంది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.132 కోట్లు చెల్లించారు. ఈ రెండు కార్యక్రమాలకు సంబంధించి కంప్యూటర్‌లో బటన్ నొక్కి ఆన్‌లైన్ ద్వారా రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ కార్యక్రమం వల్ల రైతులకు సకాలంలో పంట రుణాలు చెల్లించడం ఒక అలవాటు అవుతుందని సీఎం చెప్పారు.
Published date : 19 Nov 2020 06:45PM