రైల్వేల వారసత్వ మాసంగా ఫిబ్రవరి
Sakshi Education
2019, ఫిబ్రవరి మాసాన్ని భారతీయ రైల్వేల వారసత్వ మాసంగా రైల్వేశాఖ ప్రకటించింది.
భారతీయ రైల్వేల 160 ఏళ్ల ఘన చరితకు గుర్తుగా ఉత్సవాలను నిర్వహిస్తుంది. ఈ ఉత్సవాల్లో భాగంగా రైల్వేలకు గుర్తుగా నిలిచిన ప్రాచీన బొగ్గు(స్టీమ్) ఇంజిన్లను పలుచోట్ల నడపడానికి దక్షిణ, ఆగ్నేయ, ఉత్తర, తూర్పు తదితర రైల్వే జోన్లు ఏర్పాట్లు చేశాయి. అలాగే ముంబయి ఛత్రపతి శివాజీ టెర్మినస్, బాంద్రా స్టేషన్; కోల్‌కతాలోని గార్డెన్ రీచ్; వడోదర, ఆజ్‌మేర్ స్టేషన్ల వద్ద ప్రత్యేక వారసత్వ యాత్రలను కూడా నిర్వహించనున్నారు. నాటి వారసత్వానికి గుర్తుగా... దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి భారత రైల్వేశాఖ 230 బొగ్గు ఇంజిన్లు, 110 ప్రాచీన (వింటేజ్) కోచ్‌లు, వేగన్లను పదిల పరిచింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారతీయ రైల్వేల వారసత్వ మాసంగా 2019, ఫిబ్రవరి
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎవరు : రైల్వేశాఖ
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారతీయ రైల్వేల వారసత్వ మాసంగా 2019, ఫిబ్రవరి
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎవరు : రైల్వేశాఖ
Published date : 12 Feb 2019 05:02PM