రాష్ట్రపతికి గునియా అత్యున్నత పురస్కారం
Sakshi Education
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను గునియా తమ దేశ అత్యున్నత పురస్కారమైన ‘‘నేషనల్ ఆర్టర్ ఆఫ్ మెరిట్’’ను ప్రదానం చేసింది.
గునియా రాజధాని కొనాక్రైలో ఆగస్టు 3న జరిగిన కార్యక్రమంలో గునియా అధ్యక్షుడు అల్ఫా కొండే చేతుల మీదుగా రామ్‌నాథ్ కోవింద్ ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. భారత్-గునియా దేశాల మైత్రి బంధానికి, గునియా ప్రజల గౌరవానికి ప్రతీకగా అందజేసిన ఈ అవార్డును భారత ప్రజలకు అంకితం చేస్తున్నానన్నారు.
రాష్ట్రపతి గునియా పర్యటనలో భాగంగా మూడు ఎంఓయూలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. వైద్యం, హోమియోపతి, పునరుత్పతి ఇంధనం, ఇ-విద్యాభారతి, ఇ-ఆరోగ్య భారతి (ఈ-వీబీఏబీ) నెట్‌వర్క్ ప్రాజెక్టుల రంగాల్లో పరస్పర సహకారానికి సంబంధించి ఈ ఒప్పందాలు జరిగాయి. బెనిన్, గాంబియా, గునియా దేశాల్లో మూడు రోజుల పర్యటనలో భాగంగా చివరిగా గునియా దేశంలో రాష్ట్రపతి పర్యటించడం ద్వారా ఆయన పర్యటన పూర్తయింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గునియా అత్యున్నత పురస్కారమైన నేషనల్ ఆర్టర్ ఆఫ్ మెరిట్ ప్రధానం
ఎప్పుడు : ఆగస్టు 3
ఎవరు : భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : కొనాక్రై, గునియా

Published date : 05 Aug 2019 05:42PM