రాష్ట్రంలోని ఏయే ప్రాంతాల్లో పీడియాట్రిక్ కేర్ సెంటర్లను నెలకొల్పనున్నారు?
Sakshi Education
కోవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ముప్పునైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా రాష్ట్రంలో ప్రత్యేకంగా చిన్నారుల కోసం మూడు చోట్ల అత్యాధునిక సదుపాయాలతో కొత్త ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
విశాఖపట్నం, తిరుపతితోపాటు కృష్ణా–గుంటూరు ప్రాంతంలో మూడు అత్యుత్తమ పీడియాట్రిక్ కేర్ సెంటర్లను నెలకొల్పాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. చిన్న పిల్లల కోసం ఏర్పాటయ్యే పీడియాట్రిక్ కేర్ సెంటర్లను ఒక్కొక్కటి రూ.180 కోట్లతో నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కోవిడ్ థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలు అందుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో చిన్నారులను భద్రంగా కాపాడుకునేందుకు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ థర్డ్ వేవ్ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి జగన్ జూన్ 7న తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్షలో సమగ్రంగా చర్చించారు. థర్డ్‌వేవ్‌పై అనాలసిస్, డేటాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రాష్ట్రంలోని ఏయే ప్రాంతాల్లో పీడియాట్రిక్ కేర్ సెంటర్లను నెలకొల్పనున్నారు?
ఎప్పుడు : జూన్ 7
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ : విశాఖపట్నం, తిరుపతితోపాటు కృష్ణా–గుంటూరు ప్రాంతం
ఎందుకు : కోవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ముప్పునైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : రాష్ట్రంలోని ఏయే ప్రాంతాల్లో పీడియాట్రిక్ కేర్ సెంటర్లను నెలకొల్పనున్నారు?
ఎప్పుడు : జూన్ 7
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ : విశాఖపట్నం, తిరుపతితోపాటు కృష్ణా–గుంటూరు ప్రాంతం
ఎందుకు : కోవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ముప్పునైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు
Published date : 08 Jun 2021 06:46PM