Skip to main content

రాష్ట్రంలో తొలి పశువుల హాస్టల్ ఎక్కడ ప్రారంభమైంది?

తెలంగాణ రాష్ట్రంలో తొలి పశువుల హాస్టల్ సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామంలో ప్రారంభమైంది.
Current Affairs
రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ హాస్టల్‌ను జనవరి 8న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. వ్యవసాయంతోపాటు, వ్యవసాయ అనుబంధ పాడి పరిశ్రమను కూడా అభివృద్ధి చేస్తే చిన్న, సన్నకారు రైతులు ఆర్థికంగా పరిపుష్టిని సాధిస్తారని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.

సెంట్రీలుగా మహిళలు...
పోలీసుస్టేషన్లు, ఏసీపీ, డీసీపీ కార్యాలయాలతో పాటు పోలీసు కమిషనరేట్‌కూ నిత్యం పహారా అవసరం. ఈ విధులు నిర్వర్తించే వారినే పోలీసు పరిభాషలో సెంట్రీలని అంటారు. ఇప్పటివరకు పురుష కానిస్టేబుళ్లే సెంట్రీలుగా ఉండేవారు. అయితే తెలంగాణలోనే తొలిసారిగా హైదరాబాద్ కమిషనరేట్ అధికారులు.. ఈ విధుల్లో మహిళల్నీ వినియోగించుకోవాలని నిర్ణయించారు. మొదట బషీర్‌బాగ్‌లోని కమిషనర్ కార్యాలయంలో ఉమెన్ సెంట్రీలను ఏర్పాటుచేశారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : తెలంగాణ రాష్ట్రంలో తొలి పశువుల హాస్టల్ ప్రారంభం
ఎప్పుడు : జనవరి 8
ఎవరు : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు
ఎక్కడ : పొన్నాల గ్రామం, సిద్దిపేట జిల్లా
Published date : 09 Jan 2021 05:56PM

Photo Stories