రానున్న పదేళ్లలో ఎన్ని ఆనకట్టలను ఆధునీకరించాలని కేంద్రం నిర్ణయించింది?
Sakshi Education
రానున్న పదేళ్లలో 19 రాష్ట్రాల్లోని 736 ఆనకట్టల నిర్వహణ, ఆధునీకరణ కార్యక్రమానికి కేంద్ర కేబినెట్ అక్టోబర్ 29న ఆమోదం తెలిపింది.
ఈ పదేళ్ల ప్రణాళికలో భాగంగా రూ. 10,211 కోట్లతో ఈ కార్యక్రమ రెండో, మూడో దశ పనులు పూర్తి చేస్తామని కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. ఈ పథకం తొలి దశ 2020లో ముగిసిందని పేర్కొన్నారు. తొలి దశలో ఏడు రాష్ట్రాల్లోని 223 ఆనకట్టల నిర్వహణ చేపట్టామన్నారు.
క్విక్ రివ్వూ :
ఏమిటి : ఆనకట్టల నిర్వహణ, ఆధునీకరణ కార్యక్రమానికి ఆమోదం
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎక్కడ :దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో
ఎందుకు :రానున్న పదేళ్లలో736 ఆనకట్టలను ఆధునీకరించాలని
క్విక్ రివ్వూ :
ఏమిటి : ఆనకట్టల నిర్వహణ, ఆధునీకరణ కార్యక్రమానికి ఆమోదం
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎక్కడ :దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో
ఎందుకు :రానున్న పదేళ్లలో736 ఆనకట్టలను ఆధునీకరించాలని
Published date : 30 Oct 2020 05:41PM