రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా నియమితులైన కాంగ్రెస్ నేత?
Sakshi Education
రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే నియమితులయ్యారు.
ప్రస్తుత రాజ్యసభలో విపక్ష నేత ఆజాద్ పదవీకాలం ఫిబ్రవరి 15తో ముగిసింది. ఈ క్రమంలో ఖర్గేను విపక్ష నేతగా ఆమోదించాలంటూ రాజ్యసభ అధ్యక్షుడు ఎం.వెంకయ్యనాయుడికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రతిపాదన లేఖ పంపారు. ఇందుకు వెంకయ్య ఆమోదం తెలిపారు. కర్ణాటక నుంచి ఎన్నికై న ఖర్గే 2014 నుంచి 2019 వరకు లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా ఉన్నారు. కాంగ్రెస్‌కు ప్రస్తుత 17వ లోక్‌సభ, అంతకు ముందు 16వ లోక్‌సభలో కూడా ప్రతిపక్ష హోదా దక్కలేదు. మొత్తం సీట్లలో కనీసం 10 శాతం సీట్లు లభిస్తేనే ప్రతిపక్ష హోదా దక్కుతుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా నియమితులైన కాంగ్రెస్ నేత?
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎవరు : మల్లికార్జున ఖర్గే
ఎందుకు : ప్రస్తుత రాజ్యసభలో విపక్ష నేత ఆజాద్ పదవీకాలం ఫిబ్రవరి 15తో ముగియడంతో
క్విక్ రివ్యూ :
ఏమిటి : రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా నియమితులైన కాంగ్రెస్ నేత?
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎవరు : మల్లికార్జున ఖర్గే
ఎందుకు : ప్రస్తుత రాజ్యసభలో విపక్ష నేత ఆజాద్ పదవీకాలం ఫిబ్రవరి 15తో ముగియడంతో
Published date : 17 Feb 2021 05:59PM