రాజ్యసభలో ఎంత శాతం సీట్లు లభిస్తే ప్రతిపక్ష హోదా దక్కుతుంది?
Sakshi Education
రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా మల్లికార్జున ఖర్గేను ప్రతిపాదిస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడికి లేఖ రాశారు.
రాజ్యసభలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కలిగి ఉంది. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న గులాం నబీ ఆజాద్ సభ్యత్వ పదవీ కాలం ఈ ఫిబ్రవరి 14న పూర్తవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు ఈ మేరకు ఖర్గేను కాంగ్రెస్ పక్ష నేతగా నియమిస్తూ లేఖ రాశారు. మొత్తం సీట్లలో కనీసం 10 శాతం సీట్లు లభిస్తేనే ప్రతిపక్ష హోదా దక్కుతుంది.
రాజ్యసభ సభ్యత్వానికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి దినేశ్ త్రివేది రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు ఫిబ్రవరి 12న ఆమోదించారు.తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని, ఇష్టపూర్వకంగానే రాజీనామా చేశానని త్రివేది పేర్కొన్నారు.
Published date : 13 Feb 2021 05:46PM