Skip to main content

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా మరోసారి ఎన్నికైన వారు?

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్డీయే అభ్యర్థి, జేడీయూ నేత హరివంశ్ నారాయణ్ సింగ్ మరోసారి ఎన్నికయ్యారు.
Current Affairs
బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, సభానాయకుడు తావర్‌చంద్ గెహ్లోత్ ప్రతిపాదించగా, మూజువాణి ఓటుతో ఆయన ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షం ఆర్జేడీ సభ్యుడు మనోజ్ కుమార్‌ను తమ అభ్యర్థిగా ప్రతిపాదించారు కానీ, ఓటింగ్‌కు పట్టుబట్ట లేదు. హరివంశ్ జర్నలిస్ట్‌గా, సామాజిక కార్యకర్తగా, రాజకీయ నేతగా అందరికీ ఆప్తుడుగా ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు.

ప్రశ్నోత్తరాల సమయం రద్దు
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో సరికొత్త విధి, విధానాలతో ఉభయసభలు సెప్టెంబర్ 14న వేర్వేరు సమయాల్లో సమావేశమయ్యాయి. కోవిడ్ కారణంగా ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేస్తూ లోక్‌సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

సాధారణంగా...
సాధారణంగా సభ ప్రారంభం కాగానే తొలి గంట ప్రశ్నోత్తరాల సమయం( క్వశ్చన్ అవర్)గా ఉంటుంది. ఈ సమయంలో ప్రజా ప్రయోజన అంశాలపై సభ్యులను మంత్రులను ప్రశ్నించి, సమాధానాలు పొందవచ్చు. తాజా సమావేశాల్లో, కరోనా ముప్పు కారణంగా నెలకొన్న అసాధారణ పరిస్థితుల వల్ల సభాకార్యక్రమాల్లో క్వశ్చన్ అవర్‌ను, ప్రైవేటు మెంబర్ బిజినెస్‌ను పక్కన పెట్టాల్సి వచ్చిందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సభకు వివరించారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా మరోసారిఎన్నిక
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ఎవరు : హరివంశ్ నారాయణ్ సింగ్
Published date : 15 Sep 2020 05:39PM

Photo Stories