రాజీవ్ ఖేల్ రత్నకు బజరంగ్ ఎంపిక
Sakshi Education
అత్యున్నత క్రీడా పురస్కారమైన ‘రాజీవ్ ఖేల్ రత్న’ అవార్డుకు భారత అగ్రశ్రేణి రెజ్లర్ బజరంగ్ పూనియా ఎంపికయ్యాడు.
2018 ఆసియా గేమ్స్ (జకార్తా), కామన్వెల్త్ గేమ్స్ (గోల్డ్‌కోస్ట్) చాంపియన్ అయిన పూనియాను 12 మంది సభ్యులు గల అవార్డుల కమిటీ ఏకగ్రీవంగా నామినేట్ చేసింది. రిటైర్డ్ జస్టిస్ ముకుందకం శర్మ నేతృత్వంలోని ఈ కమిటీలో భారత క్రీడా దిగ్గజాలు బైచుంగ్ భూటియా, మేరీకోమ్ తదితరులున్నారు. ఈ కమిటీ రెండు రోజుల సమావేశం ఆగస్టు 16న మొదలైంది. తొలిరోజే చాంపియన్ బజరంగ్‌ను నామినేట్ చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపిక
ఎప్పుడు : ఆగస్టు 16
ఎవరు : రెజ్లర్ బజరంగ్ పూనియా
క్విక్ రివ్యూ :
ఏమిటి : రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపిక
ఎప్పుడు : ఆగస్టు 16
ఎవరు : రెజ్లర్ బజరంగ్ పూనియా
Published date : 17 Aug 2019 05:21PM