Skip to main content

ఫార్చూన్ జాబితాలో రిలయన్స్‌కు అగ్రస్థానం

ఆదాయం పరంగా వెలువడిన ఫార్చూన్ ఇండియా- 500 జాబితాలో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) అగ్రస్థానంలో నిలిచింది.
Current Affairsఈ జాబితా ప్రకారం.. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌ఐఎల్ రూ. 5.81 లక్షల కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. కంపెనీ వృద్ధి 41.5 శాతంగా ఉంది. ఆర్‌ఐఎల్ తర్వాత ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ను (ఐఓసీ) రెండోస్థానంలో నిలిచింది. ఐఓసీ అమ్మకాలు రూ.5.36 లక్షల కోట్లు కాగా, వృద్ధి 26.6 శాతం, లాభం రూ.39,588 కోట్లుగా ఉన్నాయి.

ఫార్చూన్ ఇండియా జాబితాలోని 500 కంపెనీల 2019 సగటు ఆదాయం 9.53 శాతం పెరగ్గా, లాభం 11.8 శాతం వృద్ధి చెందింది.

ఫార్చూన్ ఇండియా 500 జాబితా-2019

ర్యాంకు

కంపెనీ

1

రిలయన్స్ ఇండస్ట్రీస్

2

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్

3

ఓఎన్‌జీసీ

4

ఎస్‌బీఐ

5

టాటా మోటార్స్

6

బీపీసీఎల్

7

రాజేష్ ఎక్స్‌పోర్ట్స్

8

టాటా స్టీల్

9

కోల్ ఇండియా

10

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్

11

లార్సెన్ అండ్ టూబ్రో

12

ఐసీఐసీఐ బ్యాంక్

13

హిందాల్కో ఇండస్ట్రీస్

14

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

15

మహీంద్రా అండ్ మహీంద్రా


క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఫార్చూన్ ఇండియా- 500 జాబితాలో అగ్రస్థానం
ఎప్పుడు : డిసెంబర్ 16
ఎవరు : రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్)
ఎక్కడ : ఆదాయం విభాగంలో
Published date : 17 Dec 2019 05:43PM

Photo Stories