Skip to main content

ఫార్చూన్ బిజినెస్ పర్సన్‌లో సత్య నాదెళ్లకు తొలి స్థానం

ఫార్చూన్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్-2019 జాబితాలో తెలుగు తేజం, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకున్నారు.
సత్య నాదెళ్ల తర్వాత ఫోర్టెస్క్యూ మెటల్స్ గ్రూప్ సీఈఓ ఎలిజబెత్ గెయినెస్ 2వ స్థానంలో, చిపోటిల్ మెక్సికన్ గ్రిల్ సీఈఓ బ్రియాన్ నికోల్ 3వ స్థానంలో ఉన్నారు. సింక్రొనీ ఫైనాన్షియల్ సీఈఓ మార్గరెట్ కీనే 4వ స్థానంలో, ప్యూమా సీఈఓ జోర్న్ గుల్డెన్ 5వ స్థానంలో నిలిచారు.

సత్య నాదెళ్లతోపాటు మరో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన వారు ఈ జాబితాలో చోటు సంపాదించారు. మాస్టర్ కార్డ్ సీఈఓ అజయ్ బంగా 8వ స్థానంలో ఉండగా.. కాలిఫోర్నియా కంప్యూటర్ నెట్‌వర్కింగ్ సంస్థ అరిస్టా హెడ్ జయశ్రీ ఉల్లాల్ 18వ స్థానంలో నిలిచారు. ధైర్యంగా లక్ష్యాలను చేరుకోవడం, అసాధ్యాలను సుసాధ్యం చేయడం, సృజనాత్మక పరిష్కార మార్గాలను కనుగొనడం వంటి కీలక అంశాల ఆధారంగా మొత్తం 20 మందితో ఈ జాబితాను రూపొందించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఫార్చూన్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్-2019 జాబితాలో తొలిస్థానం
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల
Published date : 21 Nov 2019 05:48PM

Photo Stories