Skip to main content

పుదుచ్చేరి మాజీ సీఎం జానకీరామన్ కన్నుమూత

పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే సీనియర్ నేత ఆర్‌వీ.జానకీరామన్(78) అనారోగ్యం కారణంగా పుదుచ్చేరిలో జూన్ 10న కన్నుమూశారు.
తమిళనాడులోని విల్లుపురం జిల్లా అలత్తూర్‌కుచెందిన జానకీరామన్ పుదుచ్చేరిలోని నెల్లితోపే శాసనసభ నియోజకవర్గం నుంచి డీఎంకే తరఫున 1985, 1990, 1991 మధ్యంతర ఎన్నికల్లో, 1996, 2001లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.1996, మే 26 నుంచి2000, మార్చి 18 వరకు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2001 నుంచి 2006 వరకు ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
ఎప్పుడు : జూన్ 10
ఎవరు : ఆర్‌వీ.జానకీరామన్(78)
ఎక్కడ : పుదుచ్చేరి
ఎందుకు : అనారోగ్యం కారణంగా
Published date : 11 Jun 2019 06:46PM

Photo Stories