Skip to main content

పథకాలకు ‘ఇద్దరు సంతానం’ నియమాన్ని అమలు చేయనున్న రాష్ట్రం?

జనాభా పెరుగుదలకు కళ్లెం వేయడమే లక్ష్యంగా అస్సాం రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది.
Current Affairs ఇద్దరు సంతానం ఉన్న కుటుంబాలకే రాష్ట్రంలో అమలయ్యే పలు పథకాల నుంచి లబ్ధిపొందే అవకాశం కల్పిస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ జూన్‌ 19న స్పష్టంచేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కొన్ని పథకాలకు మాత్రమే ‘ఇద్దరు సంతానం’ నియమాన్ని అమలుచేస్తామని, ఆ తర్వాత క్రమక్రమంగా అన్ని ప్రభుత్వ పథకాలకూ ఈ నియమాన్ని తప్పనిసరి చేస్తామని ఆయన ప్రకటించారు. అస్సాంలో కేంద్ర పథకాలకు ప్రస్తుతం ఈ నియమం వర్తించదు. పాఠశాల, కళాశాలల్లో ఉచిత ప్రవేశం, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన వంటి పథకాలకు ఈ నియమాన్ని విధించబోమని హిమంత వివరణ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే గృహ పథకాలకు ఈ నిబంధన వర్తిస్తుందన్నారు.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : ప్రభుత్వ పథకాలకు ‘ఇద్దరు సంతానం’ నియమాన్ని అమలు చేయనున్న రాష్ట్రం?
ఎప్పుడు : జూన్‌ 19
ఎవరు : అస్సాం
ఎక్కడ : అస్సాం
ఎందుకు : జనాభా పెరుగుదలకు కళ్లెం వేయడమే లక్ష్యంగా
Published date : 21 Jun 2021 07:37PM

Photo Stories