పట్టణాభివృద్ధిలో భారత్‌కు సహకారం అందించనున్న దేశం?
Sakshi Education
పట్టణాభివృద్ధిలో జపాన్ సహకారం పొందేందుకు భారత్ ముందడుగు వేసింది.
ఈ మేరకు రెండు దేశాల మధ్య సహకార ఒప్పందం (ఎంఓసీ) కుదుర్చుకునేందుకు జూన్ 2న కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం... భారత్ తరఫున గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ, అలాగే జపాన్ తరఫున భూ, మౌలిక, రవాణా, పర్యాటక మంత్రిత్వశాఖల ప్రతినిధులు ఎంఓసీపై సంతకాలు చేయనున్నారు. వాస్తవానికి పట్టణాభివృద్ధికి సంబంధించి రెండు దేశాలూ 2007లో ఒక అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నాయి. దీని స్థానంలో తాజాగా ఎంఓసీ రానుంది. ఒకసారి సంతకాలు పూర్తయిన తర్వాత ఐదేళ్లు ఎంఓసీ అమల్లో ఉంటుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పట్టణాభివృద్ధిలో భారత్‌కు సహకారం అందించనున్నదేశం?
ఎప్పుడు : జూన్ 2
ఎవరు :జపాన్
ఎందుకు :రెండు దేశాలు సహకార ఒప్పందం (ఎంఓసీ) కుదుర్చుకోనున్నందున...
క్విక్ రివ్యూ :
ఏమిటి : పట్టణాభివృద్ధిలో భారత్‌కు సహకారం అందించనున్నదేశం?
ఎప్పుడు : జూన్ 2
ఎవరు :జపాన్
ఎందుకు :రెండు దేశాలు సహకార ఒప్పందం (ఎంఓసీ) కుదుర్చుకోనున్నందున...
Published date : 04 Jun 2021 02:49PM