పత్రికా స్వేచ్ఛలో భారత్‌కు 140వ ర్యాంకు
Sakshi Education
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీ - 2019లో భారత్‌కు 140వ ర్యాంకు దక్కింది.
పారిస్ కేంద్రంగా పనిచేసే రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఆర్‌ఎస్‌ఎఫ్) అనే స్వచ్ఛంద సంస్థ 180 దేశాలతో రూపొందించిన ఈ సూచీని ఏప్రిల్ 18న విడుదల చేసింది. భారత్‌లో పాత్రికేయులపై పోలీసులు, మావోయిస్టులు, నేర ముఠాలు, అవినీతి రాజకీయ నాయకులు హింసాత్మక దాడులకు పాల్పడటం, వారిని బెదిరించటం వంటివి చేస్తున్నారనిఆర్‌ఎస్‌ఎఫ్ తెలిపింది. ఇలాంటి దాడుల వల్ల 2018లో ఆరుగురు జర్నలిస్టులు చనిపోయారని పేర్కొంది. పత్రికా స్వేచ్ఛ సూచీలో 2018లో భారత్‌కు 138వ ర్యాంకు దక్కగా తాజాగా 140వ స్థానానికి చేరింది.
ఆర్‌ఎస్‌ఎఫ్ విడుదల చేసిన ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో నార్వే మూడోసారి తొలి ర్యాంకు సాధించింది. ఆ తర్వాత ఫిన్లాండ్, స్వీడన్, నెదర్లాండ్స్ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. భారత్‌కు పొరుగు దేశాలైన పాకిస్తాన్ 142వ ర్యాంకు, బంగ్లాదేశ్ 150వ ర్యాంకు ర్యాంకు పొందాయి. ఆఫ్రికా దేశాలైన ఇథియోపియా 110వ ర్యాంకును, గాంబియా 92వ ర్యాంకును పొందాయి. సూచీ చిట్టచివరన తుర్క్‌మెనిస్తాన్ (180వ ర్యాంకు), ఉత్తర కొరియా (179), చైనా (177), వియత్నా (176) ఉన్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీ - 2019లో భారత్‌కు 140వ ర్యాంకు
ఎప్పుడు : ఏప్రిల్ 18
ఎవరు : రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఆర్‌ఎస్‌ఎఫ్)

Published date : 19 Apr 2019 05:25PM