Skip to main content

పశ్చిమగోదావరి జిల్లాలో రూ. 381 కోట్లతో అభివృది పనులు

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవంబర్ 4న శంకుస్థాపన చేశారు.
Current Affairs

సుమారు రూ. 381 కోట్లతో ఏలూరు, దెందులూరు నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధి పనులకు, జిల్లాలోని రోడ్ల విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. వీటికి సంబంధించి ఏలూరు ఏఎస్‌ఆర్ స్టేడియం సమీపంలో వీవీనగర్ బెయిలీ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

సీఎం శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనలు...

  • ఏలూరు నగరానికి దుఃఖదాయినిలా మారిన తమ్మిలేరు నుంచి రక్షణకు తూర్పు, పశ్చిమ ఏటిగట్లను పటిష్టం చేస్తూ జలవనరుల శాఖ ఆధ్వర్యంలో రూ. 80 కోట్లతో కాంక్రీట్ గోడ నిర్మించనున్నారు.
  • జిల్లాలో గ్రామాలను మండల కేంద్రాలకు అనుసంధానం చేస్తూ రోడ్లు విస్తరణ, అభివృద్ధి, వంతెనల నిర్మాణ పనులను ఫేజ్ 1 కింద రూ. 201 కోట్లతో రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు.
  • జిల్లా వ్యాప్తంగా 11 రోడ్లను 74.13 కిలో మీటర్ల మేర విస్తరణ, అభివృద్ధి చేయటంతో పాటు వంతెనలు నిర్మిస్తారు.
  • పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ రూఅర్బన్ మిషన్ పథకం కింద ఏలూరు క్లస్టర్ దెందులూరు నియోజకవర్గంలో మొత్తం రూ. 100 కోట్ల విలువ గల పనులను చేపట్టగా, ఇప్పటికీ రూ. 24.14 కోట్ల విలువ కలిగిన పనులు పురోగతిలో ఉన్నాయి. ఇంకా రూ. 75.86 కోట్లు విలువ కలిగిన పనులు చేపట్టనున్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : రూ. 381 కోట్లఅభివృద్ధి పనులు ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 4
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
Published date : 05 Nov 2020 05:50PM

Photo Stories