పర్యావరణవేత్త సుఖ్‌దేవ్‌కు టైలర్ పురస్కారం
Sakshi Education
ప్రముఖ భారత పర్యావరణవేత్త, యూఎన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్(యూఎన్‌ఈపీ) రాయబారి పవన్ సుఖ్‌దేవ్‌ను ప్రతిష్ఠాత్మక ‘టైలర్ పురస్కారం-2020’ వరించింది.
పర్యావరణ రంగంలో నోబెల్‌గా పరిగణించే ఈ పురస్కారాన్ని ప్రఖ్యాత పర్యావరణ బయాలజిస్ట్ గ్రెట్చెన్ డైలీతో కలసి సుఖ్‌దేవ్ సంయుక్తంగా అందకోనున్నారు. సుఖ్‌దేవ్ చేపట్టిన ‘గ్రీన్ ఎకానమీ’ఉద్యమానికి గాను ఈ అవార్డు దక్కింది. పర్యావరణ క్షీణత, దాని ఆర్థిక పర్యవసనాలను కార్పొరేట్లు, రాజకీయ నిర్ణయాధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు సుఖ్‌దేవ్ విశేష కృషి చేశారు. 2020, మే 1న ఈ పురస్కారాన్ని సుఖ్‌దేవ్, గ్రెట్చెన్ స్వీకరించనున్నారు. ఈ అవార్డు కింద బంగారు పతకాలతో పాటు సుమారు రూ.కోటిన్నర నగదు బహుమతిని వీరు పంచుకుంటారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టెలర్ పురస్కారం-2020కు ఎంపిక
ఎప్పుడు : జనవరి 28
ఎవరు : పవన్ సుఖ్‌దేవ్
ఎందుకు : ‘గ్రీన్ ఎకానమీ’ఉద్యమానికి గాను
క్విక్ రివ్యూ :
ఏమిటి : టెలర్ పురస్కారం-2020కు ఎంపిక
ఎప్పుడు : జనవరి 28
ఎవరు : పవన్ సుఖ్‌దేవ్
ఎందుకు : ‘గ్రీన్ ఎకానమీ’ఉద్యమానికి గాను
Published date : 29 Jan 2020 06:02PM