ప్రపంచపు తొలి మెగా ఆయిల్ ట్యాంకర్
Sakshi Education
ప్రపంచంలోనే తొలి ఇంటెలిజెంట్ మెగా ఆయిల్ ట్యాంకర్‌ను చైనాకి చెందిన నౌక నిర్మాణ కంపెనీ డాలియన్ షిప్ బిల్డింగ్ ఇండిస్ట్రీ (డిఎస్‌ఐసి) నిర్మించింది.
ప్రపంచంలో తొలి స్మార్ట్ వెహికిల్ అయిన ఈ ట్యాంకర్‌కు న్యూ జర్నీ అని నామకరణం చేశారు. మూడు ఫుట్‌బాల్ మైదానాల పరిమాణంలో ఉండే ఈ ట్యాంకర్ 3,08,000 టన్నుల లోడింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అతి పెద్ద క్రూడ్ కెరీర్ (విఎల్‌సిసి) తరహాలకు చెందిన ఈ ట్యాంకర్‌లో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. 300 మీటర్ల పొడవు ఉన్న న్యూ జర్నీ ఆటోపెలైట్ నావిగేషన్, ఇంటెలిజెంట్ లిక్విడ్ కార్గొ మేనేజ్ మెంట్, ఇంటిగ్రెటెడ్ ఎనర్జీ ఎఫీషియన్సీ మేనేజ్ మెంట్‌ల సహాయంతో నడుస్తుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచపు తొలి మెగా ఆయిల్ ట్యాంకర్ ‘న్యూ జర్నీ’ రూపకల్పన
ఎప్పుడు : జూన్ 24
ఎవరు : డాలియన్ షిప్ బిల్డింగ్ ఇండిస్టీ (డిఎస్‌ఐసి)
ఎక్కడ : చైనా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచపు తొలి మెగా ఆయిల్ ట్యాంకర్ ‘న్యూ జర్నీ’ రూపకల్పన
ఎప్పుడు : జూన్ 24
ఎవరు : డాలియన్ షిప్ బిల్డింగ్ ఇండిస్టీ (డిఎస్‌ఐసి)
ఎక్కడ : చైనా
Published date : 25 Jun 2019 06:08PM