ప్రపంచంలోకెల్లా అతిచిన్న మైక్రోస్కోప్ పేరు?
Sakshi Education
ప్రపంచంలోనే అతిచిన్న మైక్రోస్కోప్‌ను హైదరాబాద్ ఐఐటీ అభివృద్ధి చేసింది. ‘ముస్కోప్’గా నామకరణం చేసిన ఈ ఆవిష్కరణ ఆటోమెటిక్‌గా పనిచేస్తుందని, దీన్ని ఎక్కడికైనా సులువుగా తరలించవచ్చని ఐఐటీ వర్గాలు జూన్ 29న తెలిపాయి.
వైద్య, పశుసంవర్ధకం, వ్యవసాయ రంగాల్లో చేపట్టే పరిశోధనలకు ఈ మైక్రోస్కోప్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నాయి. ఆఫ్–ది షెల్ఫ్ ఎలక్ట్రానిక్ చిప్‌లతో తయారు చేసిన ఈ పరికరం వ్యాధులను గుర్తించే పనిని విస్తృతం చేస్తుందని తెలిపాయి. డాక్టర్ శిశిర్ కుమార్ నేతృత్వంలో పరిశోధకులు ఏక్తా ప్రజతి, ఎంటెక్ విద్యార్థి సౌరవ్ కుమార్... ఈ మైక్రోస్కోప్‌ను అభివృద్ధి చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచంలోకెల్లా అతిచిన్న మైక్రోస్కోప్ ముస్కోప్ అభివృద్ధి
ఎప్పుడు : జూన్ 29
ఎవరు : హైదరాబాద్ ఐఐటీ పరిశోధకులు
ఎందుకు : వైద్య, పశుసంవర్ధకం, వ్యవసాయ రంగాల్లో చేపట్టే పరిశోధనలకు ఈ మైక్రోస్కోప్ ఎంతో ఉపయోగపడుతుందని...
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచంలోకెల్లా అతిచిన్న మైక్రోస్కోప్ ముస్కోప్ అభివృద్ధి
ఎప్పుడు : జూన్ 29
ఎవరు : హైదరాబాద్ ఐఐటీ పరిశోధకులు
ఎందుకు : వైద్య, పశుసంవర్ధకం, వ్యవసాయ రంగాల్లో చేపట్టే పరిశోధనలకు ఈ మైక్రోస్కోప్ ఎంతో ఉపయోగపడుతుందని...
Published date : 30 Jun 2021 06:03PM