ప్రపంచంలో అతిపెద్ద బియ్యం ఎగుమతిదారు, దిగుమతిదారు?
Sakshi Education
దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత భారత్ నుంచి చైనా బియ్యాన్ని దిగుమతి చేసుకోవడం ఆరంభించింది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా తగ్గడం, ఇదే సమయంలో భారత్‌లో బియ్యం రేటు తగ్గడంతో చైనా బియ్యం కొనుగోలుకు ముందుకు వచ్చింది.
ప్రపంచంలో భారత్ అతిపెద్ద బియ్యం ఎగుమతిదారు కాగా, చైనా అతిపెద్ద దిగుమతిదారు. ఏటా చైనా దాదాపు 40 లక్షల టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకుంటుంది. కానీ నాణ్యతా ప్రమాణాలు సాకుగా చూపుతూ భారత్ నుంచి మాత్రం బియ్యం కొనేది కాదు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్ నుంచి బియ్యం దిగుమతి ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 2
ఎవరు : చైనా
ఎక్కడ : చైనా
ఎందుకు : ప్రపంచవ్యాప్తంగా బియ్యం సరఫరా తగ్గడంతో
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్ నుంచి బియ్యం దిగుమతి ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 2
ఎవరు : చైనా
ఎక్కడ : చైనా
ఎందుకు : ప్రపంచవ్యాప్తంగా బియ్యం సరఫరా తగ్గడంతో
Published date : 03 Dec 2020 05:37PM