ప్రపంచ వ్యాప్తంగా 7.1 కోట్ల మంది శరణార్థులు
Sakshi Education
2018 ఏడాది చివరినాటికి యుద్ధాలు, హింస, విద్వేషపూరిత ఘటనల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 7.1 కోట్ల మంది ప్రజలు నిరాశ్రయిలయ్యారని ఐక్యరాజ్యసమితి శరణార్థి సంస్థ తెలిపింది.
2017తో పోల్చుకుంటే 20 లక్షల మంది శరణార్థులు పెరిగారని, ఈ మొత్తం శరణార్థుల సంఖ్య ప్రపంచలో 20వ అతిపెద్ద దేశ జనాభాకు సమానమని పేర్కొంది. ఈ మేరకు యుఎన్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ ప్రపంచ శరణార్థుల దినోత్సవం సందర్భంగా జూన్ 20న ఒక నివేదికను విడుదల చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ వ్యాప్తంగా 7.1 కోట్ల మంది శరణార్థులు
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : యుఎన్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ వ్యాప్తంగా 7.1 కోట్ల మంది శరణార్థులు
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : యుఎన్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్
Published date : 21 Jun 2019 05:29PM