ప్రపంచ మహిళల టీమ్ టెన్నిస్ విజేతగా ఫ్రాన్స్
Sakshi Education
ప్రపంచ మహిళల టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ ఫెడ్ కప్‌లో ఫ్రాన్స్ జట్టు విజేతగా నిలిచింది.
ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో నవంబర్ 10న జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్ జట్టు 3-2తో ఆస్ట్రేలియా జట్టుపై విజయం సాధించింది. 56 ఏళ్ల చరిత్ర కలిగిన ఫెడ్ కప్‌లో ఫ్రాన్స్ జట్టు టైటిల్ నెగ్గడం ఇది రెండోసారి. ఆ జట్టు మొదటిసారి 2003లో చాంపియన్‌గా నిలిచింది. నిర్ణాయక డబుల్స్ మ్యాచ్‌లో క్రిస్టినా మ్లాడెనోవిచ్-కరోలినా గార్సియా ద్వయం 6-4, 6-3తో యాష్లే బార్టీ-సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా)పై గెలిచి ఫ్రాన్స్ జట్టుకు ఫెడ్ కప్‌ను అందించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ మహిళల టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ ఫెడ్ కప్ విజేత
ఎప్పుడు : నవంబర్ 10
ఎవరు : ఫ్రాన్స్ జట్టు
ఎక్కడ : పెర్త్, ఆస్ట్రేలియా
మాదిరిప్రశ్నలు
1. ప్రపంచ మహిళల టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ ఫెడ్ కప్ విజేత?
1. ఫ్రాన్స్
2. ఆస్ట్రేలియా
3. చైనా
4. బ్రిటన్
సమాధానం : 1
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ మహిళల టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ ఫెడ్ కప్ విజేత
ఎప్పుడు : నవంబర్ 10
ఎవరు : ఫ్రాన్స్ జట్టు
ఎక్కడ : పెర్త్, ఆస్ట్రేలియా
మాదిరిప్రశ్నలు
1. ప్రపంచ మహిళల టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ ఫెడ్ కప్ విజేత?
1. ఫ్రాన్స్
2. ఆస్ట్రేలియా
3. చైనా
4. బ్రిటన్
సమాధానం : 1
Published date : 11 Nov 2019 05:58PM