Skip to main content

ప్రపంచ మానవాభివృద్ధి సూచీ-2020లో భారత్ స్థానం?

ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) డిసెంబర్ 15న విడుదల చేసిన... <b>‘‘ప్రపంచ మానవాభివృద్ధి సూచీ-2020’’</b>లో భారత్‌కు 131వ స్థానం లభించింది.
Current Affairs 189 దేశాలతో రూపొందించిన ఈ సూచీలో నార్వే అగ్రస్థానంలో నిలిచింది. నార్వే తర్వాతి స్థానాల్లో వరుసగా ఐర్లాండ్, స్విట్జర్లాండ్, హాంకాంగ్, ఐస్‌లాండ్ ఉన్నాయి. అట్టడుగున 189 స్థానంలో నైగర్ ఉంది. గత మూడు దశాబ్దాలుగా ఐక్యరాజ్యసమితి ఈ మానవాభివృద్ధి సూచీ నివేదికలను ఏటా విడుదల చేస్తోంది. ప్రతి దేశమూ తమ పనితీరు సమీక్షించుకుని సవరించుకుంటాయని దాని ఆశ. ఆయా దేశాల్లో ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలను విశ్లేషించడం ద్వారా ఈ సూచీని రూపొందిస్తారు. భారత్ 2018 మానవాభివృద్ధి సూచీలో 130వ స్థానంలో, 2019 సూచీలో 129వ స్థానంలో ఉంది.
 
2020 ప్రపంచ మానవాభివృద్ధి సూచీ-ముఖ్యాంశాలు
  • సూచీలో భారత్ కంటే కాస్త మెరుగ్గా భూటాన్ 129వ స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్ (133), నేపాల్ (142), పాకిస్తాన్ (154) మన దేశం కంటే వెనకంజలో ఉన్నాయి.
  • 2019లో భారత్‌లో సగటు ఆయుర్దాయం 69.7 ఏళ్లుగా ఉంది. ఈ విలువ బంగ్లాదేశ్‌లో 72.6 ఏళ్లు, పాకిస్తాన్‌లో 67.3 ఏళ్లు, నేపాల్‌లో 70.8 ఏళ్లు, భూటాన్‌లో 71.8 ఏళ్లుగా ఉంది.
  • పదివేల జనాభాకు సగటున మయన్మార్‌లో పది బెడ్లు వుంటే, భారత్‌లో అయిదు మాత్రమే వున్నాయి. బంగ్లాదేశ్‌లో అవి 8 అయితే, పాకిస్తాన్‌లో 6.
  • పదివేల జనాభాకు మన దేశంలో సగటున 8.6 వైద్యులుంటే పాకిస్తాన్‌లో ఆ సంఖ్య 9.8.

2020 ప్రపంచ మానవాభివృద్ధి సూచీ(హెచ్‌డీఐ)

ర్యాంకు

దేశం

హెచ్‌డీఐ విలువ(2019 సం॥)

1

నార్వే

0.957

2

ఐర్లాండ్

0.955

2

స్విట్జర్లాండ్

0.955

4

హాంకాంగ్

0.949

4

ఐస్‌లాండ్

0.949

6

జర్మనీ

0.947

7

స్వీడన్

0.945

8

నెదర్లాండ్స్

0.944

8

ఆస్ట్రేలియా

0.944

10

డెన్మార్క్

0.940

17

అమెరికా

0.926

72

శ్రీ‌లంక

0.782

114

దక్షిణాఫ్రికా

0.709

129

భూటాన్

0.654

131

భారత్

0.645

133

బంగ్లాదేశ్

0.632

142

నేపాల్

0.602

154

పాకిస్తాన్

0.557

185

బురుండి

0.433

185

సౌత్ సుడాన్

0.433

187

చాద్

0.398

188

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్

0.397

189

నైగర్

0.394

Published date : 28 Dec 2020 07:00PM

Photo Stories