Skip to main content

ప్రపంచ అథ్లెటిక్స్‌ లాంగ్‌జంప్‌లో రజతం సాధించిన క్రీడాకారిణి?

కెన్యా రాజధాని నైరోబిలో ఆగస్టు 22న ముగిసిన ప్రపంచ జూనియర్‌ అథ్లెటిక్స్‌ (అండర్‌–20) చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్‌ శైలీ సింగ్‌ రజత పతకం సాధించింది.

ఆగస్టు 22న జరిగిన మహిళల లాంగ్‌జంప్‌ ఫైనల్లో మొత్తం 12 మంది పోటీపడగా... స్వీడన్‌కు చెందిన మజ అస్కగ్‌ 6.60 మీటర్ల దూరం దూకి బంగారు పతకం సాధించింది. భారత లాంగ్‌జంపర్‌ శైలీ 6.59 మీటర్ల దూరం దూకి రజతం కైవసం చేసుకుంది. ఉక్రెయిన్‌ అథ్లెట్‌ మరియా హొరియెలొవా (6.50 మీ.) కాంస్యం గెలిచింది.

ఏఐసీఎఫ్, సీఏఐ విలీనం
చెస్‌లో ఏళ్లతరబడి రెండు పాలక వర్గాల గందరగోళానికి, వైరానికి తెరపడింది. ఇపుడు దేశమంతా ఒకే పాలకవర్గం చెస్‌ వ్యవహారాలను చక్కబెట్టనుంది. అఖిల భారత చెస్‌ సమాఖ్య (ఏఐసీఎఫ్‌), భారత చెస్‌ సంఘం (సీఏఐ) విలీనానికి ఆమోదం తెలిపాయి. ఇప్పుడు వైరివర్గాలు కలిసిపోయేందుకు అంగీకరించడంతో భారత్‌లో చెస్‌ టోర్నీల నిర్వహణ సజావుగా సాగే అవకాశముంది.

క్విక్రివ్యూ :
ఏమిటి : ప్రపంచ జూనియర్‌ అథ్లెటిక్స్‌ (అండర్‌–20) చాంపియన్‌షిప్‌లో లాంగ్‌జంప్‌ పోటీల్లో రజతం సాధించిన క్రీడాకారిణి?
ఎప్పుడు : ఆగస్టు 22
ఎవరు : భారత అథ్లెట్‌ శైలీ సింగ్‌
ఎక్కడ : నైరోబి, కెన్యా

Published date : 24 Aug 2021 02:21PM

Photo Stories