ప్రొ కబడ్డీ ఆరో సీజన్ విజేత బెంగళూరు
Sakshi Education
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) ఆరో సీజన్ విజేతగా బెంగళూరు బుల్స్ అవతరించింది.
ముంబైలో జనవరి 5న జరిగిన ఫైనల్లో బెంగళూరు జట్టు 38-33 తేడాతో గుజరాత్ ఫార్చ్యున్‌జెయింట్స్‌పై గెలుపొంది ట్రోఫీని సొంతం చేసుకుంది. పీకేఎల్‌లో బెంగళూరు విజేతగా నిలవడం ఇదే తొలిసారి కాగా గుజరాత్ వరుసగా రెండోసారి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ఐదవ సీజన్ ఫైనల్లో గుజరాత్.. పట్నా చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.
పీకేఎల్ ఆరో సీజన్‌లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డును పవన్ కుమార్ (బెంగళూర్) దక్కించుకున్నాడు. అలాగే రైడర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును ప్రదీప్ నర్వాల్ (పట్నా), డిఫెండర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును నితీష్ కుమార్ (యూపీ యోధ) సాధించారు. పీకేఎల్ విజేతకు రూ. 3 కోట్ల ప్రైజ్‌మనీ లభించగా... రన్నరప్ జట్టుకు రూ. 1.8 కోట్లు దక్కాయి. పీకేఎల్ ఏడో సీజన్ 2019, జూలైలో ప్రారంభం కానుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రొ కబడ్డీ ఆరో సీజన్ విజేత
ఎప్పుడు : జనవరి 5
ఎవరు : బెంగళూరు బుల్స్
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర

Published date : 07 Jan 2019 04:08PM