ప్రముఖ క్రికెట్ కోచ్ అచ్రేకర్ కన్నుమూత
Sakshi Education
ప్రముఖ క్రికెట్ కోచ్ రమాకాంత్ అచ్రేకర్(87)అనారోగ్యం కారణంగా ముంబైలో జనవరి 2న కన్నుమూశారు.
ఆటగాడిగా తన కెరీర్‌లో ఒకే ఒక ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ను అచ్రేకర్ ఆడారు. 1964లో హైదరాబాద్‌లో జరిగిన మొయినుద్దౌలా గోల్డ్‌కప్ టోర్నీలో భాగంగా హెచ్‌సీఏ ఎలెవన్‌తో జరిగిన పోరులో ఆయన ఎస్‌బీఐ తరఫున బరిలోకి దిగారు. కొంత కాలం ముంబై సెలక్టర్‌గా కూడా పని చేశారు. శిక్షకుడిగా సేవలకుగాను 1990లో ‘ద్రోణాచార్య’ అవార్డు అందుకున్న అచ్రేకర్‌కు 2010లో ‘పద్మశ్రీ’ పురస్కారం లభించింది.
అచ్రేకర్ వద్ద శిక్షణ పొందిన వారిలో సచిన్ టెండూల్కర్‌తోపాటు వినోద్ కాంబ్లీ, ప్రవీణ్ ఆమ్రే, సమీర్ దిఘే, బల్వీందర్ సింగ్ సంధూ, చంద్రకాంత్ పండిత్, అజిత్ అగార్కర్, రమేశ్ పొవార్ అంతర్జాతీయ క్రికెటర్లుగా ఎదిగారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ క్రికెట్ కోచ్ కన్నుమూత
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : రమాకాంత్ అచ్రేకర్(87)
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : అనారోగ్యం కారణంగా

Published date : 03 Jan 2019 05:03PM