Skip to main content

ప్రముఖ గణిత శాస్త్రవేత్త వశిష్ఠ నారాయణ్ సింగ్ ఇకలేరు

ప్రముఖ గణిత శాస్త్రవేత్త వశిష్ఠ నారాయణ్ సింగ్ (74) నవంబర్ 14న మరణించారు.
ఆయన అంత్యక్రియల్ని ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని బిహార్ సీఎం నితీశ్ చెప్పారు. పట్నా సైన్స్ కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన 1969లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో సైకిల్ వెక్టార్ స్పేస్ థియరీలో పీహెచ్‌డీ చేశారు. ఐఐటీ కాన్పూర్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ కోల్‌కతాలో పాఠాలు బోధించారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు సేవలందించారు. చాన్నాళ్లుగా ఆయన స్కిజోఫ్రేనియా అనే వ్యాధితో బాధపడుతున్నారు.

క్విక్ రివ్యూ:
ఏమిటి:
ప్రముఖ గణిత శాస్త్రవేత్త వశిష్ఠ నారాయణ్ సింగ్ మరణం
ఎప్పుడు: నవంబర్ 14, 2019
ఎవరు: నారాయణ్ సింగ్
ఎక్కడ: బిహార్ (పాట్నా)
Published date : 15 Nov 2019 05:15PM

Photo Stories