Skip to main content

ప్రజాస్వామ్య సూచీలో భారత్‌కు 51వ స్థానం

ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయూ) జనవరి 22న విడుదల చేసిన ప్రపంచ ప్రజాస్వామ్య సూచీ-2019లో భారత్ 51వ స్థానంలో నిలిచింది.
Current Affairs2018తో పోలిస్తే 2019లో భారత్ పది స్థానాలు దిగజారింది. దేశంలో పౌర హక్కులు హరించుకుపోతుండటమే ఇందుకు కారణమని ఈఐయూ వివరించింది. ప్రపంచంలోని 165 స్వతంత్ర దేశాలు, 2 స్వతంత్ర ప్రాంతాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ అమలు తీరుపై ఈఐయూ ఈ అంచనాలను రూపొందించింది. 2018లో ప్రజాస్వామ్య సూచీలో ఈఐయూ భారత్‌కు 7.23 పాయింట్లు ఇవ్వగా 2019కు వచ్చేసరికి 6.90 పాయింట్లు మాత్రమే కేటాయించింది.

భారత్‌లో బలహీన ప్రజాస్వామ్యం..
ఎన్నికల ప్రక్రియ, బహుళత్వం, ప్రభుత్వం పనిచేసే విధానం, రాజకీయ భాగస్వామ్యం, రాజకీయ సంస్కృతి, పౌర హక్కులు.. అనే అంశాల ఆధారంగా ఈ ఇండెక్స్‌ను ఈఐయూ రూపొందించింది. ఈ అంశాల్లో వచ్చిన పాయింట్ల ఆధారంగా ఆయా దేశాలను సంపూర్ణ ప్రజాస్వామ్యం (8 కంటే ఎక్కువ పాయింట్లు), బలహీన ప్రజాస్వామ్యం(6 పాయింట్ల కంటే ఎక్కువ.. 8 లేదా అంతకంటే తక్కువ), మిశ్రమ పాలన (4 కంటే ఎక్కువ, 6 కంటే తక్కువ), నియంతృత్వం (4 లేదా అంతకంటే తక్కువ పాయింట్లు). ఇందులో 8 కంటే తక్కువ 6 కంటే ఎక్కువ పాయింట్లు సాధించిన భారత్‌లో బలహీన ప్రజాస్వామ్యం ఉందని తేల్చింది.

ఈఐయూ ప్రపంచ ప్రజాస్వామ్య సూచీ-2019

ర్యాంకు

దేశం

1

నార్వే

2

ఐస్‌ల్యాండ్

3

స్వీడన్

4

న్యూజిలాండ్

5

ఫిన్‌లాండ్

51

భారత్

52

బ్రెజిల్

69

శ్రీలంక

80

బంగ్లాదేశ్

108

పాకిస్థాన్

134

రష్యా

153

చైనా

163

చాద్

164

సిరియా

165

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్

166

రిపబ్లిక్ ఆఫ్ కాంగో

167

ఉత్తరకొరియా

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ప్రజాస్వామ్య సూచీలో భారత్‌కు 51వ స్థానం
ఎప్పుడు : జనవరి 22
ఎవరు : ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయూ)
ఎక్కడ : ప్రపంచంలో
Published date : 23 Jan 2020 05:47PM

Photo Stories