పరిశ్రమలకు ఆధార్ తరహాలో ప్రత్యేక సంఖ్య
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పరిశ్రమలు, నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరాలను గుర్తించేందుకు పరిశ్రమలశాఖ ‘ఆంధ్రప్రదేశ్ సమగ్ర పరిశ్రమ సర్వే2020 (ఎస్‌పీఎస్)’ని చేపట్టింది.
పరిశ్రమ ఆధార్ అంటే...?
క్విక్ రివ్యూ :
ఏమిటి : పరిశ్రమలకు ఆధార్ తరహాలో ప్రత్యేక సంఖ్య
ఎప్పుడు : ఆగస్టు 13
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు :పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్, నీరు, నిపుణులైన మానవ వనరులను సమకూర్చేందుకు
2020, అక్టోబర్ 15కల్లా సర్వే పూర్తి చేసి అదే నెల 30వ తేదీలోగా పూర్తి సమాచారాన్ని విడుదల చేయాలని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ ఆగస్టు 14న ఉత్తర్వులు జారీ చేశారు. పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్, నీరు, నిపుణులైన మానవ వనరులను సమకూర్చడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్‌ను మొదటిస్థానంలో నిలపాలని ప్రభుత్వం భావిస్తోంది.
- ఎస్‌పీఎస్ సర్వే సందర్భంగా రాష్ట్రంలో ప్రతి పరిశ్రమకు ఆధార్ తరహాలో 11 అంకెలతో ప్రత్యేక సంఖ్యను కేటాయించి తొమ్మిది రకాల సమాచారాన్ని సేకరిస్తారు.
- - సర్వే పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాలో కలెక్టర్ చైర్మన్‌గా 11 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
పరిశ్రమ ఆధార్ అంటే...?
- పరిశ్రమలకు ఆధార్ తరహాలో కేటాయించే 11 అంకెలతో కూడిన ప్రత్యేక సంఖ్య ద్వారా అది ఏ రంగానికి చెందిన పరిశ్రమ? ఏ జిల్లాలో ఉంది? అనే వివరాలను సులభంగా గుర్తించవచ్చు.
- 11 డిజిట్స్‌లో మొదటి మూడు జిల్లాను, తర్వాత రెండు అంకెలు మండలాన్ని సూచిస్తాయి. తదుపరి సంఖ్య ఏ రంగానికి చెందిన పరిశ్రమ? అనే విషయాన్ని తెలియచేస్తుంది. చివరి 5 డిజిట్స్ సీరియల్ నంబర్ ఉంటాయి. ఇలా రాష్ట్రంలోని చిన్న పరిశ్రమ నుంచి పెద్ద పరిశ్రమ వరకు ప్రత్యేక సంఖ్యను కేటాయిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పరిశ్రమలకు ఆధార్ తరహాలో ప్రత్యేక సంఖ్య
ఎప్పుడు : ఆగస్టు 13
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు :పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్, నీరు, నిపుణులైన మానవ వనరులను సమకూర్చేందుకు
Published date : 15 Aug 2020 05:42PM