ప్రధానికి చెందిన ఏ సోషల్ మీడియా ఖాతా హ్యాక్‌కు గురైంది?
Sakshi Education
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత వెబ్‌సైట్‌కి అనుసంధానంగా ఉన్న ట్విట్టర్ ఖాతా సెప్టెంబర్ 2న హ్యాకయింది.
‘‘కరోనా కట్టడికి జాతీయ సహాయ నిధికి క్రిప్టో కరెన్సీ ద్వారా విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా. భారత్‌లో డిజిటల్ కరెన్సీ చెలామణిలోకి వచ్చింది’’అంటూ ప్రధాని ఖాతా నుంచి హ్యాకర్లు ట్వీట్ చేశారు. ‘‘ఈ అకౌంట్‌ని జాన్ విక్ హ్యాక్ చేసింది. అయితే పేటీఎం మాల్‌ని మాత్రం మేము హ్యాక్ చెయ్యలేదు’’ అని మరో ట్వీట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ట్విట్టర్ సంస్థ ప్రధాని ఖాతాను పునరుద్ధరించింది. 2020, జూలైలో బరాక్ ఒబామా, జో బెడైన్, బిల్ గేట్స్ వంటి ప్రముఖుల ఖాతాలు కూడా హ్యాక్ అయ్యాయి.
Published date : 04 Sep 2020 05:21PM