Skip to main content

ప్రధాని మోదీతో జర్మనీ చాన్స్‌లర్ మెర్కెల్ భేటీ

రెండు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చిన జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ నవంబర్ 1న న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ఉగ్రవాదం, రక్షణ, ఇంధనం, 5జీ, కృత్రిమ మేధ వంటి అంశాలపై ఇరువురు విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. ఉగ్రవాదం పీచమణచడానికి ఉమ్మడిగా పోరాటం సాగించాలని నిర్ణయించారు. అంతర్-ప్రభుత్వ సంప్రదింపుల (ఐజీసీ) భేటీకి మోదీ, మెర్కెల్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఇరుదేశాలు అంతరిక్షం, పౌరవిమానయానం, విద్య, వైద్యం, కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ వంటి 17 రంగాల్లో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. భారత నగరాల్లో హరిత రవాణా వ్యవస్థల కోసం 100 కోట్ల యూరోల ఆర్థిక సాయాన్ని అందించడానికి జర్మనీ అంగీకరించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం
ఎప్పుడు : నవంబర్ 1
ఎవరు : జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ఉగ్రవాదం, రక్షణ, ఇంధనం, 5జీ, కృత్రిమ మేధ వంటి అంశాలపై చర్చించేందుకు
Published date : 02 Nov 2019 06:11PM

Photo Stories