ప్రధాని మోదీతో అమెరికా మంత్రి సమావేశం
Sakshi Education
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సమావేశమయ్యారు.
న్యూఢిల్లీలో జూన్ 26న జరిగిన ఈ సమావేశంలో ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. అనంతరం భారత విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్‌తో పాంపియో సమావేశమయ్యారు. ఈ భేటీ సందర్భంగా నిఘా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో, ఉగ్రవాద వ్యతిరేకపోరులో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని భారత్-అమెరికాలు నిర్ణయించాయి.
పాంపియోతో భేటీ సందర్భంగ జైశంకర్ స్పందిస్తూ.. ఇతర దేశాలతో వ్యవహరించే విషయంలో తమకు భారత ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. రష్యా నుంచి ఎస్-400 క్షిపణి వ్యవస్థల కొనుగోలు విషయంలో అమెరికా ఆందోళనలను కొట్టిపడేశారు. రష్యా నుంచి ఆయుధాలు, సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేసే దేశాలపై అమెరికా కాంగ్రెస్ కాట్సా చట్టం (కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్ యాక్ట్) తెచ్చింది. దీని కారణంగా భారత్‌పై కూడా ప్రభావం పడుతోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి సమావేశం
ఎప్పుడు : జూన్ 26
ఎవరు : మైక్ పాంపియో
ఎక్కడ : న్యూఢి ల్లీ

Published date : 27 Jun 2019 05:43PM