ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ
Sakshi Education
గాన గంధర్వుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ను ప్రకటించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఈ మేరకు సెప్టెంబర్ 28న ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. లతా మంగేష్కర్, భూపేన్ హజారికా, బిస్మిల్లాఖాన్, భీంసేన్ జోషి, ఎం.ఎస్. సుబ్బలక్ష్మి లాంటి గొప్ప గాయకులు, సంగీత విద్యాంసులకు భారత రత్నను ఇచ్చి సత్కరించినట్లుగానే అసాధారణ ప్రతిభాశాలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కూడా అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించి గౌరవించాలని లేఖలో కోరారు.
మార్చి 25 నుంచి ఒలింపిక్స్ జ్యోతి రిలే
202, మార్చి 25 నుంచి జపాన్‌లోని ఫుకుషిమా నగరం నుంచి ఒలింపిక్స్ జ్యోతి రిలే కార్యక్రమం ప్రారంభిస్తామని ఒలింపిక్స్ నిర్వాహకులు తెలిపారు. 2011లో సునామీ, భూకంపం, అణు ఉద్ఘాటంతో విధ్వంసమైన ఫుకుషిమా నగరం నుంచి ప్రారంభం కానున్న రిలే కార్యక్రమం 47 నగరాల మీదుగా సాగనుంది. కరోనా కారణంగా ఒలింపిక్స్ వాయిదా పడటంతో జ్యోతి రిలే కార్యక్రమాన్ని కూడా పక్కన బెట్టారు. షెడ్యూల్ ప్రకారం 2021, జూలై 23 నుంచి ఒలింపిక్స్ జరుగనున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ
ఎప్పుడు : సెప్టెంబర్ 28
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎందుకు : గాన గంధర్వుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ‘భారత రత్న’ను ప్రకటించాలని కోరుతూ..

Published date : 29 Sep 2020 05:51PM