ప్రధాని మోదీకి రష్యా అత్యున్నత పురస్కారం
Sakshi Education
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రష్యా దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్ ద అపోస్తల్’ లభించింది.
భారత్, రష్యాల మధ్య ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామాన్ని మరింత బలోపేతం చేయడంలో మోదీ అసమాన కృషి చేసినందుకుగాను ఆయనను ఈ పురస్కారంతో గౌరవించనున్నట్టు రష్యా ప్రభుత్వం ఏప్రిల్ 12న ప్రకటించింది. భారత్, రష్యా స్నేహ సంబంధాల పునాదులు బలంగా ఉన్నాయని, భవిష్యత్తులో ఇవి మరింత వెలుగొందుతాయని ఈ సందర్భంగా మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రధాని మోదీకి ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్ ద అపోస్తల్ పురస్కారం
ఎప్పుడు : ఏప్రిల్ 12
ఎవరు : రష్యా
ఎందుకు : భారత్, రష్యాల వ్యూహాత్మక భాగస్వామాన్ని బలోపేతం చేయడంలో కృషి చేసినందుకుగాను

Published date : 13 Apr 2019 04:59PM