Skip to main content

ప్రధాని మోదీకి ఫిలిప్ కోట్లర్ అవార్డు

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తొలి ‘ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డు’ లభించింది.
న్యూఢిల్లీలో జనవరి 14న జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. విశిష్ట నాయకత్వ లక్షణాలతో దేశాన్ని నడిపిస్తున్నందుకుగాను మోదీకి ఈ అవార్డు దక్కింది. ‘ప్రజలు, లాభం, భూమి’అనే అంశాల ప్రాతిపదికన విశేష ప్రతిభ చూపిన దేశాధినేతలకు ఫిలిప్ కోట్లర్ ఏటా ఈ అవార్డు అందిస్తారు. మోడ్రన్ మార్కెటింగ్ పితామహుడిగా ప్రఖ్యాతిగాంచిన ఫిలిప్ కోట్లర్ ప్రస్తుతం అమెరికాలోని నార్త్‌వెస్టర్న్ వర్శిటీలోని కల్లోజ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విభాగంలో మార్కెటింగ్ ప్రొఫెసర్‌గా చేస్తున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డు
ఎప్పుడు : జనవరి 14
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : విశిష్ట నాయకత్వ లక్షణాలతో దేశాన్ని నడిపిస్తున్నందుకు
Published date : 16 Jan 2019 04:26PM

Photo Stories