ప్రధాని మోదీ విదేశీ పర్యటనలకు రూ.517 కోట్ల ఖర్చు
Sakshi Education
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015 నుంచి 2019 వరకు 58 దేశాల్లో పర్యటించారు. ఈ పర్యటనల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.517.82 కోట్లు ఖర్చు చేసింది.
ఈ విషయాలను భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ సెప్టెంబర్ 22న రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. ప్రధాని పర్యటనల వల్ల విదేశాలతో వ్యాపారం, వాణిజ్యం, సాంకేతిక, రక్షణ తదితర రంగాల్లో భారత్ సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయని మంత్రి పేర్కొన్నారు. మోదీ అమెరికా, రష్యా, చైనా దేశాల్లో ఐదు పర్యాయాల చొప్పున పర్యటించారు. సింగపూర్, జర్మనీ, ఫ్రాన్సు, శ్రీలంక, యూఏఈ తదిదర దేశాలకు ఒకటి కంటే ఎక్కువసార్లు వెళ్లొచ్చారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రధాని మోదీ విదేశీ పర్యటనలకు రూ.517 కోట్ల ఖర్చు
ఎప్పుడు : సెప్టెంబర్ 22
ఎవరు : భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రధాని మోదీ విదేశీ పర్యటనలకు రూ.517 కోట్ల ఖర్చు
ఎప్పుడు : సెప్టెంబర్ 22
ఎవరు : భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్
Published date : 23 Sep 2020 06:29PM