ప్రధాని మోదీ నేతృత్వంలో అంతర్రాష్ట్ర మండలి
Sakshi Education
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అంతర్రాష్ట్ర మండలిని కేంద్ర ప్రభుత్వం మరోసారి ఏర్పాటు చేసింది.
ఆరుగురు కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు/పాలనాధికారులు కూడా ఈ మండలిలో సభ్యులుగా ఉంటారు. మరో 10 మంది కేంద్ర మంత్రులు మండలిలో శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. రాజ్యాంగంలోని 263వ అధికరణం ప్రకారం అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేస్తారు. రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలపై విచారణ జరిపి, సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత అంతర్రాష్ట్ర మండలికి ఉంటుంది. అంతర్రాష్ట్ర మండలి స్థాయీ సంఘాన్ని కూడా కేంద్రం మరోసారి ఏర్పాటు చేసింది.
Published date : 15 Aug 2019 05:24PM