ప్రధాని కానుకల వేలం ప్రారంభం
Sakshi Education
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కానుకలుగా వచ్చిన వస్తువుల వేలం ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మాడర్న్ ఆర్ట్(ఎన్‌జీఎంఏ) మ్యూజియంలో జనవరి 27న ప్రారంభమైంది.
తొలిరోజు రూ.1,000 ప్రారంభ ధర కలిగిన ఛత్రపతి శివాజీ విగ్రహం రూ.22 వేలకు అమ్ముడుపోయింది. ఈ వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని గంగా నది శుద్ధి ప్రాజెక్టు ‘నమామీ గంగా’కు వెచ్చించనున్నారు. దేశవిదేశాల్లో మోదీ కానుకలుగా స్వీకరించిన శాలువాలు, టోపీలు, చిత్రపటాలు, జాకెట్లు, జ్ఞాపికలను వేలానికి ఉంచారు. ఈ వస్తువుల ప్రారంభ ధరల్ని రూ.100 నుంచి రూ.30 వేల మధ్య నిర్ధారించినట్లు సాంస్కృతిక శాఖ ప్రకటించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రధాని కానుకల వేలం ప్రారంభం
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : భారత సాంస్కృతిక శాఖ
ఎక్కడ : నేషనల్ గ్యాలరీ ఆఫ్ మాడర్న్ ఆర్ట్(ఎన్‌జీఎంఏ) మ్యూజియం, ఢిల్లీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రధాని కానుకల వేలం ప్రారంభం
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : భారత సాంస్కృతిక శాఖ
ఎక్కడ : నేషనల్ గ్యాలరీ ఆఫ్ మాడర్న్ ఆర్ట్(ఎన్‌జీఎంఏ) మ్యూజియం, ఢిల్లీ
Published date : 28 Jan 2019 06:32PM