ప్రభుత్వ ఉద్యోగులుగా ఏపీఎస్‌ఆర్టీసీ సిబ్బంది
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ)ను విలీనం చేస్తూ డిసెంబర్ 31న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ జనవరి 1న అమల్లోకి వచ్చింది. దీంతో 51,488 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రజా రవాణా శాఖ సిబ్బందిగా మారారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే సదుపాయాలన్నీ వీరికి వర్తిస్తాయి.
ప్రజా రవాణా శాఖ...
రవాణా, ఆర్‌అండ్‌బీ పరిపాలన నియంత్రణలోనే ప్రజా రవాణా శాఖను ఏర్పాటు చేశారు. రవాణా శాఖ మంత్రి ఈ శాఖకు మంత్రిగా, రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రిన్సిపల్ సెక్రటరీగా, పబ్లిక్ ట్రాన్‌సపోర్టు డిపార్ట్‌మెంట్‌కు కమిషనర్/డైరక్టర్‌గా ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ బాధ్యతలు నిర్వర్తిస్తారు.
1956లో ఏపీఎస్‌ఆర్‌టీసీగా రూపాంతరం..
1932లో అప్పటి నిజాం రాష్ట్ర రైల్వేలో ఒక భాగంగా ఎన్‌ఎస్‌ఆర్ అండ్ ఆర్‌టీడీ (నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్ ట్రాన్‌సపోర్ట్ డిపార్ట్‌మెంట్)గా ఈ సంస్థ ఆవిర్భవించింది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రా ప్రాంతం విడిపోవడం, ఆ తర్వాత నిజాం స్టేట్‌తో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక 1958లో ఏపీఎస్‌ఆర్‌టీసీగా రూపాంతరం చెందింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఎస్‌ఆర్‌టీసీ పని చేయడం మొదలుపెట్టింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రభుత్వ ఉద్యోగులుగా ఏపీఎస్‌ఆర్టీసీ సిబ్బంది
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు : ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసినందుకు
మాదిరి ప్రశ్నలు

1. చేనేత కార్మికులకు ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ పథకంను ఎప్పుడు, ఎక్కడ ప్రారంభించారు?
1. ధర్మవరం 2019, డిసెంబర్ 21
2. గుంతకల్లు 2019, డిసెంబర్ 21
3. నందికొట్కూరు 2019, సెప్టెంబర్ 25
4. తెనాలి 2019, సెప్టెంబర్ 25
- View Answer
- సమాధానం: 1
2. వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకంను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పుడు ప్రారంభించారు?
1. 2019, నవంబర్ 28
2. 2019, నవంబర్ 24
3. 2019, నవంబర్ 21
4. 2019, అక్టోబర్ 21
- View Answer
- సమాధానం: 3
Published date : 02 Jan 2020 06:21PM