ప్రాఫిట్ ట్యాక్స్ విధానానికి ఆమోదం తెలిపిన కూటమి?
Sakshi Education
ప్రపంచంలోని దిగ్గజ టెక్నాలజీ కంపెనీలపై 15 శాతం గ్లోబల్ కార్పొరేట్ ప్రాఫిట్ ట్యాక్స్‌ను విధించేందుకు జీ–7 కూటమి దేశాలు అంగీకరించాయి.
బహుళ జాతి కంపెనీలు కార్యకలాపాలు నిర్వహించే ప్రతి దేశంలో గ్లోబల్ ట్యాక్స్ రేట్ 15 శాతంగా ఉండాలని తీర్మానించాయి.కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యూఎస్(జీ–7) దేశాల ఆర్ధిక మంత్రులతో జూన్ 5న లండన్‌లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయా దేశాలు తాజా ఒప్పందం మీద సంతకాలు చేశాయని బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషిసునక్ తెలిపారు. భౌతికంగా ఉనికి లేకపోయినా సరే వ్యాపారం చేసే ఇంటర్నెట్ ఆధారిత సంస్థలకు (ఆన్‌లైన్ కంపెనీలు) కూడా పన్ను విధానాల సమస్యలను పరిష్కరించేందుకు జీ–7 దేశాలు ప్రయత్నిస్తున్నాయి. చాలా వరకు ఆన్‌లైన్ కంపెనీలు తక్కువ లేదా నో ట్యాక్స్‌లతో కార్యకలాపాలు సాగిస్తుంటాయి.మరోవైపు బ్రిటన్ లోని కార్న్‌వాల్‌లో 2021, జూన్ 11–13 తేదీల్లో జీ–7 దేశాల వార్షిక శిఖరాగ్ర సమావేశం జరగనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచంలోని దిగ్గజ టెక్నాలజీ కంపెనీలపై 15 శాతం గ్లోబల్ కార్పొరేట్ ప్రాఫిట్ ట్యాక్స్‌ను విధించేందుకు తీర్మానం
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : జీ–7 కూటమి దేశాలు
ఎందుకు : పన్ను విధానాల సమస్యలను పరిష్కరించేందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచంలోని దిగ్గజ టెక్నాలజీ కంపెనీలపై 15 శాతం గ్లోబల్ కార్పొరేట్ ప్రాఫిట్ ట్యాక్స్‌ను విధించేందుకు తీర్మానం
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : జీ–7 కూటమి దేశాలు
ఎందుకు : పన్ను విధానాల సమస్యలను పరిష్కరించేందుకు
Published date : 07 Jun 2021 07:20PM