Skip to main content

పోల్‌వాల్ట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేసిన ఆటగాడు?

పోల్‌వాల్ట్ దిగ్గజం సెర్గీ బుబ్కా (ఉక్రెయిన్) పేరిట 26 ఏళ్ల నుంచి చెక్కు చెదరకుండా ఉన్న అవుట్‌డోర్ ప్రపంచ రికార్డు బద్దలయింది.
Current Affairs
స్వీడన్ పోల్ వాల్టర్ ఆర్మాండ్ డుప్లాంటిస్ ఇటలీ రాజధాని నగరం రోమ్‌లో సెప్టెంబర్ 17న జరిగిన డైమండ్ లీగ్ మీట్ సందర్భంగా ఈ ఘనత సాధించాడు. 20 ఏళ్ల డుప్లాంటిస్ ఈ మీట్‌లో 6.15 మీటర్ల ఎత్తుకు ఎగిరాడు. తద్వారా 1994లో ఇటలీలో 6.14 మీటర్లతో సెర్గీ బుబ్కా నమోదు చేసిన అవుట్‌డోర్ ప్రపంచ రికార్డును ఈ స్వీడన్ స్టార్ తిరగరాశాడు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : పోల్‌వాల్ట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేసిన ఆటగాడు
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : ఆర్మాండ్ డుప్లాంటిస్
ఎక్కడ : డెమండ్ లీగ్ మీట్, రోమ్, ఇటలీ
Published date : 19 Sep 2020 04:59PM

Photo Stories