Skip to main content

పోలాండ్‌ ఓపెన్‌ టోర్నీలో స్వర్ణం నెగ్గిన భారత రెజ్లర్‌?

పోలాండ్‌ ఓపెన్‌ వరల్డ్‌ ర్యాంకింగ్‌ సిరీస్‌ రెజ్లింగ్‌ టోర్నీలో భారత మహిళా స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ స్వర్ణం పతకం గెలుచుకుంది.
Current Affairs
26 ఏళ్ల వినేశ్‌ 53 కేజీల విభాగంలో చాంపియన్‌గా నిలిచింది. పోలాండ్ రాజధాని వార్సాలో జూన్ 11న జరిగిన ఫైనల్లో వినేశ్‌ 8–0తో క్రిస్టినా బెరెజా (ఉక్రెయిన్‌)పై విజయం సాధించింది. 2021 ఏడాది వినేశ్‌ ఆసియా చాంపియన్‌షిప్‌లో, మాటియో పెలికాన్‌ టోర్నీలో స్వర్ణ పతకాలు గెలిచింది.

కజరష్విలీపై వేటు..
భారత గ్రీకో రోమన్‌ స్టయిల్‌ రెజ్లింగ్‌ జట్టు విదేశీ కోచ్‌ టెమో కజరష్విలీ (జార్జియా)పై స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) వేటు వేసింది. వాస్తవానికి ఆయన కాంట్రాక్ట్‌ 2021 ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌తో ముగియాల్సి ఉంది. అయితే గ్రీకో రోమన్‌ విభాగంలో భారత్‌ నుంచి ఒక్క రెజ్లర్‌ కూడా ఒలింపిక్స్‌కు అర్హత సాధించకపోవడంతో రెండు నెలలు ముందుగానే కజరష్విలీని కోచింగ్‌ బాధ్యతల నుంచి తప్పించారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : పోలాండ్‌ ఓపెన్‌ వరల్డ్‌ ర్యాంకింగ్‌ సిరీస్‌ రెజ్లింగ్‌ టోర్నీలోస్వర్ణం నెగ్గిన భారత రెజ్లర్‌?
ఎప్పుడు :జూన్ 11
ఎవరు :భారత మహిళా స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌
ఎక్కడ : వార్సా, పోలాండ్
Published date : 12 Jun 2021 07:00PM

Photo Stories