Skip to main content

పీఎం స్వనిధి పథకాన్ని ప్రధాని మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?

కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న వీధి వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించిన ప్రత్యేక సూక్ష్మ రుణ పథకం ‘ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి(PM SVANIDHI-పీఎంస్వనిధి)’ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
Current Affairs

ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 27న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ... వీధి వ్యాపారుల నిజాయితీ, కష్టపడేతత్వాన్ని తమ ప్రభుత్వం గుర్తించి, వారికి రుణసాయం అందజేస్తోందని అన్నారు.ఈ సందర్భంగా ప్రధాని ఆగ్రా, వారణాసి, లక్నోలకు చెందిన ప్రీతి, అర్వింద్‌ మౌర్య, విజయ్‌ బహదూర్‌ అనే ముగ్గురు లబ్ధిదారులతో మాట్లాడి, రుణసాయం వారికి ఏ విధంగా ఉపయోగపడనుందో అడిగి తెలుసుకున్నారు.

చదవండి: పీఎం స్వనిధి పథకం ద్వారా వీధి వ్యాపారులకు ఎంత మొత్తాన్ని రుణంగా అందించనున్నారు?

విజిలెన్స్ అవేర్‌నెస్‌ వీక్‌...
కొన్ని రాష్ట్రాల్లో వేళ్లూనుకుపోయిన వంశపారంపర్య అవినీతి అక్కడి రాజకీయ సంస్కృతిలో భాగంగా మారిపోయిందని మోదీ వ్యాఖ్యానించారు. సీబీఐ నిర్వహిస్తున్న మూడు రోజుల జాతీయ సదస్సును ఆయన అక్టోబర్ 27న ప్రారంభించి ప్రసంగించారు. సమాజంలో క్రమంగా అవినీతి కూడా ఒక భాగంగా మారుతుందని పేర్కొన్నారు. 2020, అక్టోబర్ 27వ తేదీ నుంచి నవంబర్‌ 2 వరకు జరుగుతున్న ‘విజిలెన్స్ అవేర్‌నెస్‌ వీక్‌’ను పురస్కరించుకుని సీబీఐ ఈ సదస్సు ఏర్పాటు చేసింది. అవినీతి వ్యతిరేక చట్టంలో చేపట్టాల్సిన సవరణలపై ఈ సదస్సులో చర్చిస్తారు.

క్విక్ రివ్వూ :

ఏమిటి : ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి(PM SVANIDHI-పీఎంస్వనిధి) పథకం ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : ఉత్తరప్రదేశ్
ఎందుకు :కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న వీధి వ్యాపారుల కోసం
Published date : 28 Oct 2020 05:19PM

Photo Stories